దేశం గర్వించదగ్గ వ్యక్తి అంబేడ్కర్‌

3
– అంబేడ్కర్‌ నాణేలను విడుదల చేసిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,డిసెంబర్‌4(జనంసాక్షి): భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారక నాణేలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఆదివారం ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రూ.125లు, ,రూ. 10 నాణేలను ఆయన విడుదల చేశారు. తొలుత పార్లమెంటు భవన్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ, అనంతరం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులో అంబేడ్కర్‌ ఒకరని ఆయన ప్రశంసించారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారన్నారు.అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తన మరణానికి నాలుగు రోజుల ముందు ఆఖరి పుస్తక రచన పూర్తి చేశాడని తెలి.పారు. ఆ రోజుల్లో మార్క్స్‌ సిద్దాంతాలు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయని, భారత దేశంలో కూడా సామాజిక ఆలోచనలపై మార్క్స్‌ ప్రభావం పడుతున్న కాలమదని ఆ తరుణంలో అంబేడ్కర్‌ బుద్ధ భగవానుడి సిద్దాంతాల ఆధారంగా ఆ పుస్తకం రాశారని మోదీ వెల్లడించారు. ఆయన ఎల్లప్పుడూ బహుజన హితాయ- బహుజన సుఖాయ అని కోరుకున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, థావర్‌ చంద్‌ గె¬్లత్‌ తదితరులు పాల్గొన్నారు.