దేశభక్తి ఉప్పొంగాలి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి  ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి
* భారత కీర్తి దశదిశల వ్యాపించేలా వజ్రోత్సవాలు
*  రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి )  :ప్రతి పౌరుని లో దేశభక్తి ఉప్పొంగే విధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భారత స్వాత్యంత్ర్య సిద్దించి 75 వసంతాలను పూర్తిచేసుకున్న  శుభ సందర్బంగా నిర్వహించుకుంటున్న వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా  రెపరెపలాడాలని మంత్రి  అన్నారు.భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో బాగంగా   మంగళవారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో  జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ  దేశం గర్వింగేలా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు.  గడిచిన 75 సంవత్సరాలలో మనదేశం ఎంతో పురోగతిని సాధించిందని అన్నారు.  భారత కీర్తి పతాకా దశ దిశల వ్యాప్తి చెందేల అగస్టు 8 నుండి 15 రోజుల పాటు  వజ్రోత్సవాలను కుల,మతాలకు అతీతంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.  జిల్లాలో 3,08,754 గృహలను గుర్తించడం జరిగిందని,  కరీంనగర్ మున్సిపల్  కార్పోరేషన్ లోని 79,953 గృహాలలో ప్రతి ఇంటి పై జెండా రెపరేపాలాడాలని, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. గతంలో సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కాలం   ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాల  4నెలల 26 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు  నారా చంద్రబాబు నాయుడుకు  ఉండేదని ఆ రికార్డును    రాబోయో అగస్టు 15 నాటికి  మన రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ గారు 8 సంవత్సరాల 4నెలల 26 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనతను సాధించానున్నారని తెలిపారు. ఆగస్టు 16న  దేశభక్తిని పెంపొందించే విధంగా  ఎక్కడి వారక్కడ  ఎకకాలంలో  జాతీయగీతాలాపన చేయాలని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. 75 సంవత్సరాల దేశాభివృద్దిని, దేశ పురోగతిని, దేశభక్తిని  భావితరానికి చాటిచెప్పెలా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ  రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. దేశ పౌరుడిగా ప్రతి  ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజాప్రతినిధులకు, అధికారులకు జాతీయజెండాను అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ వజ్రోత్సవాలను అగస్టు 8న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రారంబించు కోవడం జరిగిందని తెలిపారు.  మంగళవారం నుండి 22 వరకు నిర్వహించనున్న వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగిందని తెలిపారు.  ఇప్పటికే జిల్లాలో 2లక్షల జాతీయ జెండాలను తీసుకోవడం జరిగిందని వాటిని జిల్లాలోని 5 మున్సిపాటిలు మరియు 16 మండలాల్లో మున్సిపల్, పంచాయితి సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి జాతీయజెండాను అందిచడం జరుగుతుందని తెలిపారు. జాతీయ జెండా  ప్రాముఖ్యత గురించి చెప్పి ఇవ్వాలన్నారు.  ప్రతిఒక్కరు జాతీయ జెండాకు గౌరవాన్ని ఇవ్వాలని, ఎగరవేసే సమయంలో నిబంధనను పాటించాలని, జాతీయ జెండాకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిది అన్నారు.  జాతీయ జెండా ఎగరవేసిన చోట వివిధ పార్టీలకు సంబంధించిన జెండాలను ఎగరవేయడం గాని జాతీయ జెండా కన్న పైకి గాని, సమానంగా గాని ఎటువంటి జెండాను ఎగరవేయకూడదని తెలిపారు.  జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని జిల్లాలోని అన్ని సినిమా థియోటర్లలో మంగళవారం నుండి ప్రదర్శించడం జరుగుతుందని పేర్కోన్నారు.అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్, మేయర్ సి పి లతో కలిసి  పట్టణంలోని భగత్ నగర్ లో ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి జాతీయ జెండాను ఇంటింటికి అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా అధికారులు, కార్పొరేటర్లు,  తదితరులు పాల్గొన్నారు.