దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుంది
– మోదీ శకం ఐదేళ్లకే ముగుస్తుంది
– నాలుగేళ్ల బీజేపీ విధానాలతో ప్రజలు విసిగిపోయారు
– ఉప ఎన్నికల్లో ఫలితాలు వాటిని రుజువు చేశాయి
– ధొలేరా నగరాన్ని ప్రమోట్ చేసినట్లు.. అమరావతిని ఎందుకు ప్రమేట్ చేయడం లేదు?
– ఏపీలో బీజేపీ పోకడను చూస్తే ‘ఆపరేషన్ గరుడ’ నిజమేననిపిస్తోంది
– బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– బీజేపీపై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి యనమల
అమరావతి, మే31(జనం సాక్షి) : నాలుగేళ్ల బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలు విసిగిపోతున్నారని, ఉపఎన్నికల ఫలితాలు రుజువుచేశాయని, ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు అని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీరును ఎండగట్టారు. దేశ వ్యాప్తంగా బీజేపీపై ఎదురుగాలి చాలా బలంగా వీస్తోందన్నారు. దీనికి ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. గతంలో రెండు ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నారని.. ఇప్పుడు మరో దెబ్బతిన్నారని ధ్వజమెత్తారు. అయినా వరుస ఓటములపై బీజేపీలో ఆత్మ విమర్శ కొరవడిందని తెలిపారు. కర్ణాటక ఎన్నికలతో ప్రారంభమైన బీజేపీ పతనం.. ఇప్పుడు రెండో అంకం ఉపఎన్నికల ఫలితాలతో తేలిందన్నారు. ఇక 2019 ఎన్నికలతో బీజేపీ ఓటముల పరంపర పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. మోదీ శకం 5ఏళ్లకే ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. అబద్దాలను నిజాలుగా భ్రమింపజేయడానికి బీజేపీ పెద్దలు పడుతున్న ఆపసోపాలు తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రకటనలతో తేటతెల్లమైందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ధొలేరా నగరాన్ని ప్రమోట్ చేసినట్లుగా అమరావతిని ఎందుకు ప్రమోట్ చేయలేదని నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధుల గురించి మహానాడులో వివరించేసరికి బీజేపీ నాయకులకు వడదెబ్బ తగిలి దిమ్మ తిరిగిందన్నారు. ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకే హడావుడిగా తెలుగు రాష్ట్రాల్లో ధొలేరాపై యాడ్స్ గుప్పించారన్నారు. బీజేపీ ఇచ్చిన యాడ్స్‌తో తెలుగువారికి పుండు విూద కారం జల్లినట్లుగా ఉందన్న సంగతి గుర్తించుకోవాలన్నారు. ఏపీకి ఇచ్చిన నిధులు, పనులు అన్నీ కాగితాలకే పరిమితం చేశారన్నారు. గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకే కేంద్ర నిధులు ముట్టచెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. ప్రత్యేక ¬దా కోసం ఎంతకాలమైనా వేచి ఉండాలన్న కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఏపీకి 5 ఏళ్లు కాదు.. 10ఏళ్లు ప్రత్యేక ¬దా ఇవ్వాలని రాజ్యసభలో డిమాండ్ చేసింది బీజేపీ కాదా? అని నిలదీశారు. అలాగే బీజేపీ మేనిఫెస్టోలో ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక ¬దా ఇస్తామన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? అని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పట్నుంచి ఏపీపై కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు. ఒక వైపు జగన్‌తో లాలూచీ రాజకీయాలు చేస్తూనే.. మరోవైపు పవన్‌కళ్యాణ్‌తో విమర్శలు చేయిస్తున్నారని విమర్శించారు. ఇంకోవైపు కన్నాతో.. ఇంకెవరో లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పించడం.. మరోవైపు ఐవైఆర్ కృష్ణారావుతో పుస్తకాలు రాయించడం, రమణదీక్షితులతో ఆరోపణలు చేయించడం ఇవన్నీ చూస్తుంటే ఎవరో చెప్పినట్లుగా ‘ఆపరేషన్ గరుడ’ ప్రచారం నిజమేనేమో అని అనుమానం కల్గుతుందన్నారు. ఇదే ధోరణితో వ్యవహరిస్తే బీజేపీ పెద్దల వ్యూహం బెడిసికొట్టడం ఖాయమన్నారు. కన్నడియుల వలే ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీని
యనమల హెచ్చరించారు.