దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ
వనపర్తి రైతుబంధు కార్యక్రమంలో మంత్రి జూపల్లి
వనపర్తి,మే10(జనం సాక్షి): ఎన్నో పథకాలతో ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు రైతుబంధుతో మరింత ఖ్యాతిని సంపాదించుకుందని పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతులకు పెట్టుబడి పథకం సస్య విప్లవానికి నాంది అన్నారు. వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం అన్నారంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పుడు రైతుబంధు ద్వారా మరోసారి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి, పంటకు 4 వేల రూపాయలను పెట్టుబడి సాయంగా అందజేస్తాం. ప్రతి ఏటా రెండు పంటలకు రైతులకు సహాయం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90శాతం మంది సన్న, చిన్నకారు రైతులకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్ అందుతుంది. నీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఇక వ్యవసాయం అంటే పండుగే అనే రోజులు తెచ్చామని పేర్కొన్నారు. స్థానిక అధికారుల, కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.