దేశానికి కేసీఆర్‌ నాయకత్వం చారిత్రక అవసరం

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
మునుగోడు సెప్టెంబర్ 13(జనంసాక్షి):
అస్తవ్యస్తమైన మోదీ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 75 లక్షల మంది టిఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఉన్నారన్నారు ఉద్యమనాయకుడు అన్ని భాషల్లో మాట్లాడగలిగిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఎనిమిదిన్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గుర్తింపు పొందిందన్నారు. దేశంలో కెసిఆర్ పార్టీని పెట్టి అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చి పరిపాలన చేయాలన్నదే నా ఆకాంక్ష అన్నారు. ఉచిత కరెంటు తెలంగాణలో అమలు చేశాడని, కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారన్నారు. రైతు బాంధవుడైన కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమన్నారు. ప్రజా వ్యతిరేక, అవినీతి బిజెపి పోవాలంటే కెసిఆర్ దేశ రాజకీయాల్లో అడుగు పెట్టాలన్నారు. నిత్యవసర ధరల పెంపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే మోడీ లక్ష్యమన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్నారు.మోటర్లకు మీటర్లు అమలు అయితే తెలంగాణలోని 35 లక్షల మంది రైతుల మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు. మోడీకి తెలంగాణ అంటే కోపమని తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు ఆయన తెలిపారు.తెలంగాణకు 35 వేల కోట్లు కేంద్రం బాకీ ఉన్నదని అది వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని రెండు లక్షల మంది ప్రజలను మోసం చేసి రాజీనామా చేశారన్నారు.రాజీనామాతోనే రాజగోపాల్ రెడ్డి ఓటమి ప్రారంభమైందన్నారు. టిఆర్ఎస్ గెలిచిన పర్వాలేదని బిజెపి మాత్రం గెలవొద్దని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుందన్నారు. మునుగోడులో 40 వేల మందికి పింఛన్లు,ఎంతోమందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,అనేక పథకాలు అమలు చేసిన టిఆర్ఎస్ కే మునుగోడులో ఓటు అడిగి హక్కు ఉందన్నారు.ఈమునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.ఈ సమావేశంలో మునుగోడు టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి,ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్,ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి నాగరాజుగౌడ్,ఈద నిర్మలశరత్,తదితరులు పాల్గొన్నారు