దేశానికే మనం ఆదర్శం : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

ఆలస్యంగా వస్తే కలెక్టర్​ కు ఫిర్యాదు చేస్తాం : ఎంపీపీ కరుణం అరవింద్​ రావ్​
పనులు చేసుడు సరే పైసలెప్పుడిస్తరు.. : సర్పంచ్​ బద్రిగారి రజిత
పరిగి రూరల్​, అక్టోబర్​ 22 ( జనం సాక్షి ) :
తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక మన ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగిలో శనివారం ఎంపీపీ కరుణం అరవింద్​ రావ్​ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా  ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారన్నారు. పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.అనంతరం ఎంపీపీ కరణం అరవింద్​ రావ్​ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం అంటే అంత చులకనా.. మీం ఫోన్లు పిలిస్తేనే వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేవారు. మరో మారు ఇలాం జరిగితే ఉపాక్షించేది లేదన్నారు. ఇలా ఆలస్యమైతే, సమావేశానికి రానిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తామన్నారు. అనతరం చిట్యాల సర్పంచ్​ బద్రిగారి రజిత మాట్లాడుతూ క్రీడా ప్రాంగణం, వైకుంఠ దామం, వర్మికంపోస్టు షెడ్డు, క్రిమిటోరియం సంక్షేమ పథకాల పనులు అభివృద్ది చేసి నెలలు గడుస్తున్నా రికార్డు చేసే వారు లేరని, బిల్లులు అందడం లేదన్నారు. ఇందుకు పంచాయతీ రాజ్​ డీఈ శ్రీనివాస్​ సమాధానమిస్తూ రికార్డు చేయడంలో కొత్త సాప్ట్​ వేర్​ రావడం , ఆల్​లైన్​లో టెక్నికల్​ సమస్యలు ఉన్నాయని త్వరలో సమస్యలు అధిగమించి నమోదు చేస్తామన్నారు. రాఘాపూర్​ సర్పంచ్​ నల్క జగన్​ మాట్లాడుతూ గ్రామంలో వీధిలైట్లకు సంబంధించి లైన్​ డైరెక్టుగా ఉండటం వల్ల 24 గంటలు వెలుగుతూనే ఉన్నాయాన్నరు. నజీరాబాద్​ సర్పంచ్​ ముడావత్​ గణేష్​ మాట్లాడుతూ అధనంగా మంచి నీటి ట్యాంకు అవసరం అని పదేపదే చెబుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. రికార్డులు చేయడంలో పంచాయతీ రాజ్​ శాఖలో మరో ఏఈ ఉంటే బాగుంటుందని రాపోల్​ ఎంపీటీసీ ఉప్పరి రవి సాగర్​ తెలిపారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సమస్యలపై ప్రశ్నించారు. ఈ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ బేతు హరిప్రియ, పీఏసీఎస్​ చైర్మన్​ కొప్పుల శ్యాంసుందర్​ రెడ్డి, ఏఎంపీసీ చైర్మన్​ అంతిగారి సురేందర్​ కుమార్​, వైస్​ ఎంపీపీ కావలి సత్యనారాయణ, ఎంపీడీఓ శేషగిరి శర్మ, ఈఓ ఆర్​డీ దయానంద్​, డిప్యూటి తహసిల్దార్​ నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్​ :
22 పిఆర్​ జి 01లో సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి