దేశాభివృద్ధిలో ఇంజనీర్లది కీలక పాత్ర

– రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట (జనంసాక్షి): దేశాభివృద్ధిలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషించారని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.గురువారం ఇంజనీర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశానికీ స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశం అన్నిరంగాలలో వెనకబడి వుందని, అటువంటి సమయంలో ఇంజనీర్లు నదుల మీద ప్రాజెక్టుల నిర్మాణం చేయడంతో దేశంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించిందని అన్నారు.సీఎం కెసిఆర్ నిరంతరం పర్యవేక్షణ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, తద్వారా కరువు ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు.పారిశ్రామిక అభివృద్ధిలో ఇంజనీర్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తూ దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా ఇంజనీర్లు కెఎల్ఎన్ చారి రిటైర్డ్ బ్రిగేడియర్ , ఫారుఖ్ , రఫి , అక్షిత్ కుమార్ రెడ్డి , మనోహర్ , మల్సూర్, మమత , సిద్దిక్ హుస్సేన్ లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఉప్పల రాజేంద్ర ప్రసాద్, బండారు రాజా, నాతి సవీందర్, వంగవేటి రమేష్ , ఎస్వీ కాలేజ్ హెచ్ఓడిలు నాగరాజు, శివశంకర్ , రాంజి , ఎంవిఎన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.