దేశ ఐక్యతకే భారత్ జోడో యాత్ర-బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ కారుకురి రాం చందర్.

దేశ ఐక్యత కోసమే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ కారుకురి రాం చందర్ అన్నారు. సోమవారం భారత్ జోడో యాత్రకు మద్దతుగా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట నుంచి ప్రారంభం అయిన మోటార్ సైకిల్ యాత్ర బెల్లంపల్లి, తాండూరు, బిమిని, కన్నెపల్లి మండలాల మీదుగా నెన్నెల మండలం చేరుకొని ముగింపు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి, మసి పూసి మారేడు కాయను చేసి పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాల్లోని నల్లధనం వెలికితీసి ప్రతి వ్యక్తి ఖాతాలో ₹ 15 లక్షలు వేస్తానని అధికారం చేపట్టి, ఇప్పడు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పాలన కొనసాగిస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అలవి కాని హామీలు ఇచ్చి ఆతర్వాత త్వరలోనే అనే అనంతరం ఇచ్చిన హామీలు మరిచిపోవడం ఆనవాయితీగా మారిందన్నారు. దీనికి నిదర్శనంగా తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ లాంటి హామీలే అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మత్తమారి సూరిబాబు, జనగామ తిరుపతి, గట్టు మల్లేష్, దుర్గం రవీందర్, జలంపల్లి భీష్మయ్య, సింగతి తిరుపతి, ఇతర నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

తాజావార్తలు