దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర

మహబూబ్ నగర్ , అక్టోబర్ 23 (జనంసాక్షి ) : సెక్యులర్ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుట్రలు చేస్తున్నారని దేశ సమగ్రత సమైక్యత పరిరక్షణ కోసం భారత్ జోడో యాత్రను చేపట్టినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆదివారం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం వద్ద ఉన్న ఇరు రాష్ట్రాల కలయిక బ్రిడ్జ్ వద్దకు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకుంది తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ భారత్ జోడో  యాత్రకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలతో బతుకమ్మ బోనాలు డోలు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు సంఘీభావం తెలుపుతూ యాత్రను ప్రారంభించారు రాయచూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ రేవంత్ రెడ్డికి జాతీయ జెండా కాగడను యాత్ర కొనసాగింపు కు చిహ్నంగా అందించారు. రాహుల్ గాంధీ వెంబడి  ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు . కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు లక్షమేర సంఖ్యలో తరలివచ్చారు దీంతో కృష్ణ మండలం అంతా జన సంద్రంగా మారిపోయింది ఒక్కసారిగా మండలం పులకించిపోయింది ఎంతో ఉత్సాహంతో భారత్ జోడోయాత్ర మొదటి రోజు సాగుతూ గుడేబల్లూరు గ్రామం వరకు సాగింది .అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగించారు రాహుల్ గాంధీ మాట్లాడుతూ లౌకిక భారతదేశంలో ఆర్ఎస్ఎస్ బిజెపి పార్టీలు కుట్రపూరితంగా మతవిద్వేషాలను రెచ్చకొడుతూ భిన్నత్వం చేయాలని చూస్తున్నారని అందుకోసమే లక్ష్యంగా భారత్ జోడోయాత్రను సమైక్య భారతదేశం కోసం దేశాన్ని కాపాడాలని ఉద్దేశంతో ప్రారంభించామని ఈ భారత్ జోడోయాత్ర ను ఏ శక్తి కూడా అడ్డుకోలేదని కన్యాకుమారి నుండి ప్రారంభించిన ఈ యాత్ర తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ లతోపాటు తెలంగాణ లోను చూస్తున్న అనూహ్యస్ స్పందనకు ఆదరణకు ఉత్సాహంక ముందుకు ఈ యాత్రను సాగిస్తానన్నారు ఇంతటి ఉత్సాహాన్ని చూపించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం తల్లి తెలంగాణ రాష్ట్ర విగ్రహాన్ని ఆవిష్కరించి విగ్రహానికి పూలమాల వేశారు దేశంలో రైతులు రోజు కూలీలు యువత అలాగే మహిళలు తో ఈ యాత్రలో కార్నర్ పాయింట్స్ ఏర్పాటు చేసి వారితో వారి సమస్యలను చర్చించి వారి మాటలను వింటానన్నారు దీ దీపావళి పండుగ సందర్భంగా ఈ యాత్రను మూడు రోజులపాటు విరామం ఉంటుందని దీపావళి అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ నూతన అధ్యక్షులు మల్లికార్జున్ కరిగే ప్రమాణ స్వీకారోత్సవం ఉన్న సందర్భంగా విరామం అనంతరం మక్తల్ పట్టణం నుండి 27వ తేదీన ఉదయం తిరిగి పునః ప్రారంభం ఉంటుందని రాహుల్ గాంధీ తెలిపారు యాత్రలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాతీయ నాయకులు జిల్లా ల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు