దైవచింతనతే నే మానసిక ప్రశాంతత

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు…..దైవచింతన తోనే మానవ జన్మ సార్థకం అవుతుందని తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి సన్నిధికి చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నందకుమార్ పూజారి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండి సుఖసంతోషాలతో ఉండాలని ఆ దత్తాత్రేయ స్వామిని కోరుకున్నట్టు తెలిపారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని వెల్లడించారు.
గురుపౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తెరాస పట్టణ బీసీసెల్ ఉపాధ్యక్షులు కోటం శివ ప్రసాద్
,టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు హరి గౌడ్
తదితరులు ఉన్నారు.