దోపిడీ దొంగల బీభత్సం

నల్గొండ: అర్వపల్లి మండలం నర్సింహగూడెంలో రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. 5 తులాల బంగారం, రూ. 25 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.