దోమ..పల్లె ప్రగతి షెడ్యూల్లో భాగంగా శుక్రవారం సర్పంచ్ కె రాజిరెడ్డి తో కలిసి నర్సరిని సందర్శించినట్లు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తెలిపారు వర్షాలు ప్రారంభం కాగానే ఎంపిక చేసిన స్థలాల్లో అందరి సహకారం తో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం అవుతుందని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో ఐకేపీ సిబ్బంది నారాయణ శేకర్ మాదవి భాగ్య మౌనిక అంగన్వాడీ కార్యకర్తలు జి నిర్మల బీమమ్మ జే నిర్మల ఏఎనేమ్ సత్యమ్మ సీనియర్ సిటిజెన్ అంజబాబు ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు
జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో జూన్ 10 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో శాంతినగర్ నందు నిరుద్యోగ యువతను ఉద్దేశించి రాబోయే కాలంలో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో తో ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ కోచింగ్ సెంటర్ కు 20,000/- ఆర్థిక సహాయాన్ని అందించిన బి ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోయపల్లి భరత్ కుమార్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితంగా రాబోయే నోటిఫికేషన్లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే దిశగా ప్రణాళికను సిద్ధం చేసుకుని సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రుల కళలను నెరవేర్చాలని అన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థి ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగ పరచుకొని ఉద్యోగాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని ఒకవేళ ఉద్యోగాలు సాధించలేని వారు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా మన కుటుంబాలు నాశనం అవుతాయి అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ కు అనుగుణంగా ఆ రంగంలో ముందుకు దూసుకెళ్లాలి అన్నారు. విద్యార్థులు మనస్తాపం చెందకుండా ధైర్యంగా నిలబడాలి అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత కోచింగ్ అందిస్తున్న యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కోచింగ్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని అదేవిధంగా నిరుద్యోగులు అందరికీ బి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఎప్పుడు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోయపల్లి భరత్ కుమార్ రెడ్డి తో పాటుగా సామాజిక సేవకురాలు కన్యాధారా శాంతి, జర్నలిస్ట్ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Attachments area