దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టం : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్ల కొనుగోలు ఆరోపణలపై నివేదిక త్వరగా ఇవ్వాలని సీబీఐని కోరినట్లు చెప్పారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి. చర్యలు తీసుకుంటామన్నారు. దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. సీబీఐ ప్రాధమిక నివేదిక ఆధారంగా ఆరు సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగిపై ఆరోపణలకు సంబంధించి సమాచారం లేదని చెప్పారు.