ద్వేషం పిరికిపందల లక్షణం
– పారికర్‌పై రాహుల్ ఫైర్
దిల్లీ,జులై 31(జనంసాక్షి): రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చురకలంటించారు. బాలీవుడ్ నటుడు ఆవిూర్‌ఖాన్ గతంలో ‘దేశం విడిచి పోవాలనుకున్నాం’ వ్యాఖ్యలపై మనోహర్ పారికర్ విమర్శలు చేశారు. ఈ అంశంపై రాహుల్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘పారికర్ సహా భాజపా మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అందరికీ ఒక పాఠం చెప్పాలనుకుంటోంది. అయితే వారికో పాఠం.. ద్వేషం పిరికివాళ్ల లక్షణం. అది ఎప్పటికీ గెలవదు’ అని విమర్శించారు.పాత్రికేయుడు, రచయిత నితిన్ గోఖలే రాసిన ‘సియాచిన్’ మరాఠి పుస్తకాన్ని కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పేరు లేవనెత్తకుండా ఆవిూర్‌ఖాన్‌పై విమర్శలు సంధించారు. ‘భారత్ నుంచి వెళ్లిపోదామని తన భార్య చెప్పినట్లు ఓ నటుడు అన్నారు. అది దురహంకార ప్రకటన. నేనే పేదవాడినై ఒక చిన్న ఇంట్లో జీవిస్తుంటే అక్కడి నుంచి పారిపోకుండా అక్కడ బంగ్లా నిర్మించేందుకు కలగనేవాడిని’ అని పారికర్ అన్నారు.