ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. రైతులకు ఏకకాలంలోనే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ రద్దుచేసి బాధిత రైతులకు సత్వరం న్యాయం చేయాలని అన్నారు. ధరణి వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ధరణి వల్ల ఒకరి పేరుకు ఉండగా మరొకరి పేరు నమోదు అవుతుందని వాపోయారు. రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బి నర్సింలు, మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్, పట్టణ అధ్యక్షుడు ఏ రవికుమార్,
గొల్లపల్లి నారాయణ, మందుల నరేందర్, సాయి ఫైనాన్స్ శీను, ముష్టిపల్లి నర్సిములు, పెద్దింటి మల్లేష్, కున్సి నాగేందర్, కున్సి అన్వర్, మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, కల్లూరి గోవర్ధన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు