ధరల పెరుగుదలకు ప్రభుత్వాలే కారణం: చంద్రబాబు

హైదరాబాద్‌ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గస్‌పార్క్‌ వద్ద తెదేపా చేపట్టిన ఆందోళన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వందరోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పి, అధికారంలో వచ్చిన తర్వాత ధరల విపరీతంగా పెంచిందని అరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర ధరలు 300 నుంచి 400 శాతం పెరిగాయని వెల్లడిరచారు. ప్రజాసమస్యలపై చర్చ జరగడం లేదని, శాసనసభ జరుగుతున్న తీరు భాధాకరంగా ఉందన్నారు. స్పీకర్‌ వ్యవహారశైలిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభ నిర్వహించాల్సిన బాద్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.