ధరూర్ లో మంత్రాలయ పీతాదీపతి శ్రీశ్రీ సుబుదేంద్ర తీర్ధ స్వామి శోభ యత్ర

-అర్చకులు,గ్రామస్థులతో కలిసి స్వాగతం పలికిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి…
  గద్వాల ప్రతినిధి డిసెంబర్ 04 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ పార్థసారథి స్వామి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలో భాగంగా శ్రీ గురు ప్రతిష్టాన్ ట్రస్ట్ ద్వారా ధరూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ సహకారంతో గ్రామంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయ పీతాదీపతి శ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి శోభ యాత్ర నిర్వహించారు.. వీరిని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.. కార్యనిర్వాహక సభ్యులు శేషగిరిరావు, జయరామచార్యులు,కిష్టచార్యులు,మధ్వాచార్యులు, పాండప్పయ్య,గిరిధర్ రావు,శ్రీనివాసరావు,గ్రామస్థుల లతో కలిసి ఘన స్వాగతం పలికారు…శనివారం సుప్రభాత సేవా, భజన మండల భక్తులచే కోరకొండ వెంకటేశ్వర స్వామి సన్నిధికి కాలినడకన భజన చేస్తూ మోట్లోత్సవము శ్రీగురు సార్వభౌమదాస సాహిత్య ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ అప్పణాచారి  నేతృత్వంలో జరిపారు..శ్రీ పార్థసారథి సన్నిధిలో సామూహిక భగవద్గీత పారాయణం వివిధ పాఠశాల విద్యార్థుల కంఠ స్థపాతులు నిర్వహించారు..ఈ కార్యక్రమానికి మంత్రాలయ పీతాదీపతి శ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి వారి పురవీధుల శోభ యాత్ర బస్టాండ్ నుండి పార్థసారథి దేవాలయం వరకు భక్తులకు దర్శనం ఇచ్చారు. కోలాట నృత్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది….ఈ కార్యక్రమంలో ఫణి మోహన్ రావు,శ్రీకాంత జోషి,సత్యరెడ్డి,భీమ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచి ఈశ్వర్,మల్దకల్, గ్రామస్థులు, పెద్దలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు….