ధర్మపురిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

దర్మపురి : కరీంనగర్‌ జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి 3 గంటల ప్రాంతంలో స్వామివారికి మహాక్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అలంకరించిన వేదిక పైకి ఉత్సవమూర్తులను తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

తాజావార్తలు