ధర్మపురిలో డిగ్రీ కాలేజ్ ను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి శుక్రవారం 21 (జనం సాక్షి న్యూస్ )జగిత్యాల జిల్లా ధర్మపురి లో నూతనంగా ఏర్పడిన డిగ్రీ కాలేజీ మరియు మైనార్టీ కాలేజ్ ను మరియు కూరగాయల మార్కెట్ ను శంకుస్థాపన చేసిన, తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత,జిల్లా కలెక్టర్ రవి నాయక్, పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ,ఎనిమిది ఏండ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సృష్టించిన విజనరీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏనాడైనా ప్రతి జిల్లా కో మెడికల్ కళాశాల వస్తుందని ఎవరు ఊహించలేదన్నారు, తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని, అలాగే అంబేద్కర్ స్ఫూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఉచిత విద్యాబోధన సాగిస్తున్నారు
సీఎం సహాయనిధి పుణ్య కార్యక్రమం, పేదలకు సీఎం సహాయనిధిలో రాష్ట్రంలోనే ధర్మపురి నంబర్ వన్ అని మంత్రి అన్నారు ధర్మపురిలో 900 విద్యార్థుల సామర్ధ్యం తో డిగ్రీ కళాశాల ఏర్పాటైందని, డయాలసిస్, ఐసీయూ ఏర్పాటు చేసిన సీఎం కు ధర్మపురి ప్రజల తరపున ధన్యవాదాలు
ప్రతిష్టాత్మక రోల్ల వాగుకు వరదల వల్ల నష్టం జరిగితే 136 కోట్లు ఇచ్చామని, ముఖ్యమంత్రి రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు, 24 గంటల కరెంటు రద్దుకు కేంద్రం కుట్ర జరుగుతోందని, వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కొర్రీలు పెడుతుందని, అందుకే రైతులు, ప్రజలు కేంద్రం కుట్రలను తిప్పి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు..