ధర్మపురి మండల కేంద్రంలో టిఆర్ఎస్ నుండి బీఎస్పీ లోకి పెద్ద ఎత్తున చేరికలు

ధర్మపురి (జనం సాక్షి) పట్టణ కేంద్రంలో తెనుగు వాడ సోమవారం ఉదయం టిఆర్ఎస్ ను వీడి బీఎస్పీలోకి యువత పెద్ద ఎత్తున చేరారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పనితనానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు మరియు బిసి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల బ్రతుకులు బాగుపడాలంటే బహుజన రాజ్యం రావాల్సిందేనని అత్యధిక శాతం ఉన్న మా బీసీల వాటా చట్టసభల్లో ఎంత అని ప్రశ్నించారు. బహుజన్ సమాజ్ పార్టీ మాపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయమని మడిమతిప్పకుండా పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తామని అన్నారు. గత కొద్ది రోజులుగా భూమి పట్టాలు లేని ఇండ్లలో నివసిస్తున్న మాకు పట్టాలు ఇప్పించమని పలుమార్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆయన స్పందించకపోగా కనీసం ఒక్క ఆఫీసర్ కూడా ఇటువైపు వచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు, ధర్మపురి గడ్డమీద నీలి జెండాను ఎగరవేస్తామని రానున్న రోజుల్లో భోజన రాజస్థాపనకై ఊరూరా తిరిగి ఏనుగు గుర్తుకు ఓటు వేయమని చెబుతామని, అత్యధిక శాతం ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనార్టీలు అందరం ఏకం కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జట్టి శ్రీనివాస్, మందుల నాగేష్, పూలవేణి గణేష్ ,ఉమేష్, గోపి, నాగరాజ్ వేణు, వీర వేణి గణేష్, జైనపురం వేణు, లోకేష్, మనోజ్ కుమార్ అభి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు