ధర్మసాగర్ కట్టపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దీక్ష
వరంగల్: ఇవాళ ధర్మసాగర్ రిజర్వాయర్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. ధర్మసాగర్ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి వ్యవసాయానికి నీరందించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టానున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్షకు సంఘీభావం తెలపనున్నారు. ఎమ్మెల్యేలు హరీష్‌రావు వినయ్‌భాస్కర్, మొలుగూరి భిక్షపతి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరుకానున్నారు.