ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్
ఆరుగాలం స్వెదo చిందించి, ధాన్యం తీసుకు వచ్చిన రైతు ను నీళ్ళు,నీడ లేని దైన్యం లో ఉంచి వడ్ల సేకరణ చేయవద్దనీ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ టాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన చిన్న అడిశర్ల పల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. పీ పీ సీ లను ప్రారంభించే ముందే రైతులకు నీళ్ళు, నీడ ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. ఐనా కొందరు తేలిగ్గా తీసుకుని, పీ పీ సీ ల వద్ద రైతుల ను వెతల పాలు చెస్తే సహించేది లేదని హెచ్చరించారు. వడ్ల లో తేమ ను ఎలా నిర్ధారించాలో శ్రీదేవి అనే మహిళ కు అవగాహన కలిగించారు. ఎంత మంచి రైతులు నమోదు అయ్యారు. ఎంత ధాన్యం వచ్చింది అన్న వివరాలను సేకరించారు. రైతులు చెట్ల కింద నీడ లో ఉంటారు. పొలాల వద్ద పంపు నీళ్ళు తాగుతారు అని కనీస సౌకర్యాలు కల్పించకుండా అలసత్వం తో సమాధానం ఇచ్చిన పీ పీ సీ నిర్వాహకుల పై అసంతృప్తి,ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సహకార అదికారి కి పరిస్థితి ని వివరించి, తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.