ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మునగాల, నవంబర్ 11(జనంసాక్షి): రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మునగాల సింగిల్ విండో చైర్మన్ కందిబండ సత్యనారాయణ అన్నారు. మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద మునగాల వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయన ప్రారంభించారు .ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ కు తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు మొసపోవొద్దని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ఏ గ్రేడ్ ధాన్యానికి 2వేల 60 రూపాయలకు, కామన్ గ్రేడ్ 2వేల 40 రూపాయలు మద్దతు ధర రైతులకు అందిచాలని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరమ్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, లింగారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ లు దేవరం వెంకటరెడ్డి, మట్టారెడ్డి, పలువురు రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.