ధూంధాంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: ఎమ్మెల్యే
సిద్దిపేట,జనం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ధూంధాంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ తన అస్తిత్వాన్నిచాటుకుని ముందుకు సాగుతున్నదని, అందుకు సిఎం కెసిఆర్ కృషి కారణమన్నారు.తెలంగాణ సాధించి, దానిని అభివృద్ది పథానా నిలిపిన మహానుభావుడు మన సిఎం కెసిఆర్ అన్నారు. అందుకే గ్రామాలు మొదలు జిల్లా వరకు అంతా ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ వెనుకబాటుకు గురైందని, నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో విప్లవాత్మక మార్పులతో ముందు వరుసలో ఉందన్నారు. మౌలిక వసతుల విషయంలో పట్టణాలకు దీటుగా పల్లె సీమలు అభివృద్ధి చెందుతున్నాయని అందుకు అభిశృద్ది కార్యక్రమాలే నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణకు ఖ్యాతి తెచ్చారని పేర్కొన్నారు. పంట పొలాలకు సాగనీరందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికే మల్ల న్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఒకవైపు ప్రాజెక్టుల నిర్మాణాలకు తాము అడ్డు కామని చెబుతూనే.. మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తీరుతామని పేర్కొన్నారు. చెరువు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా జవ జీవాలు అందించడజరుగుతుందన్నారు. మిషన్ భగీరథ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ ఇంటింటికి సురక్షితమైన గోదావరి జలాలు అందించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని, ఆడపడుచులు నెత్తిన బిందె పెట్టుకోకుండా ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందన్నారు.
————————-