నకిరేకల్‌లో కాంగ్రెస్‌ను నిలదీసిన ప్రజలు

నల్లగొండ,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లాలోని నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలోని ఇస్లాంపూరం గ్రామంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని మహిళలు నిలదీశారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కే తాము ఓటు వేస్తామని తేల్చిచెప్పారు. ప్రజలు నిలదీయడంతో విధిలేని స్థితిలో కాంగ్రెస్‌ నేతలు వెనుదిరిగారు. నకిరేకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య పోటీ చేస్తున్న

విషయం తెలిసిందే.