నకిలీ నోట్ల వెనుక పాకిస్తాన్

fake_indian_notes20150616143506భారత్‌లో నకిలీ నోట్ల ప్రవాహం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఇదే విషయాన్నిపలు అంతర్జాతీయ సంస్థలు కూడా ధ్రువీకరించాయి. అత్యంత నాణ్యంగా, అచ్చం ఇండియన్ కరెన్సీ నోట్లలానే ఉండే నకిలీ నోట్లను పాకిస్తాన్‌లో ముద్రించి… భారత్‌లోకి దొంగచాటుగా తరలిస్తున్నట్టు ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కూడా నిర్థారించింది. మనీ ల్యాండరింగ్, తీవ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై పోరాటానికి ప్రపంచ దేశాలకు సహకరించే అంతర ప్రభుత్వ సంస్థే ఎఫ్ఏటీఎఫ్. రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ… నకిలీ నోట్లు భారత్‌లోకి రావడం వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు పరోక్ష విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్ఏటీఎఫ్ సైతం అదే విషయాన్ని రెండేళ్ల క్రితమే బయటపెట్టింది. భారత కరెన్సీ నోట్ల ముద్రణకు ఉపయోగించే టెక్నాలజీని, మెటీరియల్‌ను కూడా పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లకుండా కట్టడి చేస్తోంది అన్నారు.