నకిలీ ఫోన్ కాల్స్ గురించి అవగాహన

సారంగాపూర్… మండలం లోని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రజల వద్దకే వెళ్లి పలు చోట్లలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా…సైబర్ క్రైమ్ లో జరిగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మోసాల గురించి వివరించారు, ఓ టీ పీ ని ఎవరికి తెలుపవద్దని , ఎనీ డెస్క్, టీమ్మాట్,క్విక్ సపోర్ట్ వంటి ఆప్ లను డౌన్లోడ్ చేయొద్దని తెలిపారు. ఉద్యోగాలు, రుణాలు, భీమా పాలసీని ఇస్తామని వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దని తెలిపారు. అత్యవసర సమయంలో ఏదైనా జరిగితే 100 కి కాల్ చేయమని సూచించారు. తెలంగాణ పోలీస్ వారు విడుదల చేసిన పత్రాలని ప్రజలకు అవగాహన నిమిత్తం అందజేశారు.