నకిలీ మద్యం పట్టివేత
ఆదిలాబాద్,ఆగస్ట్4(జనం సాక్షి ): ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో నకిలీ మద్యం తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్య ఫంక్షన్‌హాల్ యజమాని సృజన్‌రెడ్డి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు సంఘటనా స్థలంలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో తయారైన మద్యాన్ని తీసుకువచ్చి ఎంసీ బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా పట్టణాల్లో బార్లకు నకిలీ మద్యం సరఫరా జరుగుతోంది.