నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
దుబ్బాకలో తనిఖీలు చేపట్టిన అధికారులు
సిద్దిపేట,మే25(జనంసాక్షి): రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ముందస్తుగా ఫర్టిలైజర్స్ షాప్స్ దాడి చేసి నకిలీ ఎరువులపై ఆరా తీసారు. పోలీస్ శాఖ,వ్యవసాయ శాఖాధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న నెపంతో పర్టిలైజర్ షాపులపై దాడులు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నిషేధిత బీట్ 3పత్తి విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకే ఫర్టిలైజర్ షాపులపై దాడులు నిర్వహించామన్నారు. షాపుల్లో క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించామన్నారు. అలాంటి విత్తనాలేవీ లేవన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ పరశురాం గౌడ్, వ్యవసాయశాకా అధికారి మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీట్ 3పత్తి విత్తనాలు ఎవరైనా అమ్మినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు అంతేకాకుండా బీట్ 3 పత్తి విత్తనాలు భూమిలో వేస్తే భూమి సారవంతాన్ని కోల్పోతుందన్నారు. గ్రామాలలో నకిలీ విత్తనాలు అమ్మినట్లు మాకు సమాచారమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.