నకిలీ విత్తన అమ్మకాల్లో అధికారులదే బాధ్యత
కిసాన్ మోర్చా
మెదక్,జూలై6(జనం సాక్షి):నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో అధికారులను బాధ్యులను చేయాలని కిసాన్‌మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ఎక్కడ విత్తనాలు అమ్మకాలుజరగుఉతన్నాయో అధికారులకుతెలుస్తుందని అన్నారు. వారిని ముందే గుర్తిస్తే రైతులను ఆదుకున్న వారు అవుతారని అన్నారు. వివిధ జిల్లాల్లో నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులను ఆదుకోవాలిన అన్నారు. అలాగే విత్తనాలు అమ్మి మోసం చేసిన కంపెనీలు లేదా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రం రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం విధానం కారణంగా ఫలితం లేకుండా పోతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం రాష్ట్రానికి రూ.9వేల కోట్లు, ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద 98శాతం ప్రీమియంను కేంద్రమే చెల్లిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఈ పథకం కింద లబ్దిపొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దఫదఫాలుగా రుణమాఫీ నిధులు విడుదల చేస్తోందన్నారు. దీంతో బ్యాంకులు వాటిని వడ్డీ కింద జమచేసు కుంటున్నాయన్నారు. దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు.