నకిలీ విత్తన కంపెనీల పని పట్టాలి

నల్లగొండ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): సమగ్ర విత్తన చట్టాలు తీసుకువచ్చి నకిలీ విత్తన కంపెనీలను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బి.వెంకటరమణ  డిమాండ్‌ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్‌ చేశారు.రైతుల ఆత్మహత్యలను నివారించి స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు. సమగ్ర విత్తన చట్టాలను రూపొందించి నకిలీ విత్తన కంపెనీలను రద్దు చేయాలన్నారు. వ్యవసాయానికి సమగ్ర చట్టం చేసి నకిలీ విత్తనాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అన్ని ప్రాజెక్టులకు అమలు చేయాలన్నారు. 60 ఏళ్లు నిండిన రైతులకు రూ.10 వేల మేర పింఛను ఇవ్వాలని, ఏళ్లుగా పోడు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమండ్‌ చేశారు.

తాజావార్తలు