నగదు బదిలీ చేయకుంటే గొల్లకురుమల అగ్రహానికి ప్రభుత్వం గురికాకతప్పదు
జిఎంపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్
పెన్ పహాడ్. నవంబర్ 18 (జనం సాక్షి) :నగదు బదిలీ చేయకుంటే గొల్ల కురుమల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలో సత్య ఫంక్షన్ హాల్ లో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం(GMPS)మండల కమీటి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి అనంతరం మండల ప్రధమ మహాసభ సంఘం జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసి జిల్లా కార్యదర్శి వీరబోయిన రవితో కలిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొల్లకూరుమలకు గొర్రెల పంపిణీ 2017 జూన్ 20 న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు ఆనాడు మాట్లాడుతూ తెలంగాణలో మాంసం ఉత్పత్తిలో చాల వెనుకబడి పోయమని మన రాష్టానికి ఇతర రాష్టాలనుండి అనేకమైన గొర్రెలు మేకలు దిగుమతి అవుతున్నాయి కావున అక్కడి రాష్ట్రములోని గొర్రెల కాపరులు ఆర్థికకంగా మన డబ్బులతో వారు అభివృద్ధి చెందుతున్నారని. రాష్ట్రములోని గొల్లకూరుమల కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వారిని మొదలు కొని ముసలి వారి వరకు ఒక్క కుటుంబంలో ఎంతమంది మగవాళ్ళు ఉంటే అంతమందికి గొర్రెల పంపిణీ చేపట్టి తెలంగాణలోని గొల్లకూరుమలను కోటీశ్వర్లు చేస్తానని. గొర్రెలు మేత మేయుటకు గ్రామాలలోని మమీడి తోటలు. పండ్ల తోటలలో మేతగడ్డికి ప్రభుత్వం గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారని ముందు మన రాష్ట్రములో ఉన్న గొర్రెలకు ఉచితంగా (ఇన్సూరెన్స్)బీమాపథకం చేస్తామని ఉపాధి హామీ ధ్వారా గొర్రెలకు షెడ్స్ నిర్మాణం చేసీస్తామని అక్కడి నుండి వచ్చే గొర్రెలకు అక్కడే ఇన్సూరెన్స్ చేస్తేనే లారీలలో డీసీయం లలో వస్తుంటే చనిపోతే వెంటనే గొర్రెకు బదులుగా గొర్రెలు ఇస్తాను అని ఒక్క యూనిట్ కు మూడు క్వింటల్ల దాణ బస్తాలు అడవిలో గొర్రెలకు జ్వరం వస్తే గొర్రెల కాపరి ఇంటికి పోయి వచ్చేసరికి గొర్రెలు భారీ ప్రమాదంలోకు పోతాయని. అని ఒక్క యూనిట్ కు ఒక్క మందుల కిట్టు ఇస్తానాని గొర్రెలపంపిణీ ప్రారంభం రోజున స్వయంగా ముఖ్య మంత్రిగారు హామీలిచారని. మొదటి విడుతలో ముసలి గొర్రెలు. చిన్నపిల్లలు పంపిణీ చేశారని. గొర్రెలు పంపిణీలో కొంతమంది డాక్టర్ లు. కొంతమంది లీడర్స్ మాత్రమే బాగుపడ్డారు కాని గొల్లకురుమలు మాత్రం బాగుపడలేదు అని గొర్రెల పంపిణీ లో అనేక అక్రమాలు జరుతున్నాయని ఇక రెండోవిడుత గొర్రెల పంపిణీకి రెండోసారి అధికారంలోకి రావడానికి గొల్లకురుమలచే డీడీలు తీపించి ఐదు సంవత్సరాలు గడిచిన గొర్రెలు పంపిణీ చేయలేకపోయారని రాష్ట్రములో ఉపఎన్నికలు వచ్చినకాడ గొర్రెలు పంపిణీ చేసుడు తరువాత మల్లి అదేతంతుగా వ్యవహరించిన తీరు ప్రజలందరికి తెలుసనీ అన్నారు గొల్ల కురుమలు అభివృద్ధి కావాలంటే కచ్చితంగా నగదు బదిలీ చేస్తేనే తప్ప వేరే మార్గం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, ఉప ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, నగదు బదిలీ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గొర్ల కాపర్లను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టపల్లి హనుమయ్య, మున్న కొములయ్య, లొడంగి సంజీవరావు, కన్నెబోయిన ఎర్రయ్య, కోమ్మనబోయిన నాగరాజు, గొర్ల అంజయ్య, గొర్ల నాగరాజు, బడేటి గోపయ్య, పేర్ల సోమయ్య, పేర్ల సైదులు, బొల్లం లింగయ్య, కట్ట బిక్షం, మెంతబోయిన లింగయ్య, తదితరులు పాల్గొన్నారు..