నగరంలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
హైదరాబాద్ : నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. సరూర్‌నగర్ శ్రీరామ్‌నగర్‌లో ఇంటిముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో 4తులాల బంగారు ఆభరణాన్ని తెంచుకెళ్లారు. బైక్ పై సైదాబాద్ లోని వచ్చిన ఇద్దరు వ్యక్తులు… తన మెడలోని చైన్ లాక్కెళ్లినట్టు… బాధితురాలు తెలిపింది. మరోవైపు సైదాబాద్ కాలనీలో పాల ప్యాకెట్లు తీసుకు వస్తుండగా మరో మహిళ మెడలోని 3 తులాల గొలుసు తెంచుకెళ్లారు.