నగరంలో రేపు వైఫై సేవలు ప్రారంభం

హైదరాబాద్ ని వైఫై సిటీగా మార్చేందుకు తొలి అడుగు పడుతోంది. తొలిదశ ఉచిత వైఫై సేవలను హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు హోటల్ మారియట్ లో ఈ సేవలను ప్రారంభించనున్నారు. తొలి వీడియో కాల్ లో మంత్రి కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో మాట్లాడతారు.
ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్న ఉచిత వైఫై సేవలు ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్, నెక్లేస్ రోడ్డులో అందుబాటులో ఉంటాయి. 1800 నుంచి 2500 మంది ఒకేసారి లాగిన్ అయ్యే సదుపాయం ఉంది. 30 నిమిషాల పాటు ఉచితంగా వైఫై సేవలు పొందవచ్చు. దీని వేగం రెండు ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది.