నగరంలో వ్యాక్సిన్‌ కొరత

సెకండ్‌ డోస్‌ కోసం ప్రజల ఎదురుచూపు
హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): జీహెచ్‌ఎంసీలో టీకాల కొరత వెంటాడుతోంది. నగరంలో వ్యాక్సిన్‌ కోసం 56 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. సెకండ్‌ డోస్‌ కోసం లబ్దిదారుల అవస్థలు పడుతున్నారు. 7 నెలలైనా ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ పక్రియ పూర్తికాలేదు. నిన్నటి నుంచి మళ్లీ ఫస్ట్‌ డోస్‌ ప్రారంభించినప్పటికీ ఒక్కో సెంటర్లో 50 మందికి మాత్రమే టీకా ఇస్తున్నారు. వరుస పండుగలు, సభలు సమావేశాలతో గ్రేటర్‌లో కోవిడ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.