నగర పంచాయతీలు మాకద్దు

ముస్తాబాద్ ఆగస్టు 7 జనం సాక్షి
ముస్తాబాద్ మండల పోతుగల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామం, ముస్తాబాద్ తో పాటు మొర్రాయిపల్లి గ్రామాలు నగర పంచాయతీలుగా ఏర్పాటు నిర్ణయం ఈ టీఆర్ఎస్ మండల నాయకులు తీసుకోవడం జరిగింది. ఇలాంటి నిర్ణయంతో ఉపాధి హామీతో పాటు గ్రామంలో మధ్యతరగతి వారికి నష్టం వాటిల్లుతుందని గ్రామ ప్రజలు వాపోయారు. కోల కృష్ణ గౌడ్ మాట్లాడుతూ దీనికి ముస్తాబాద్ పట్టణానికి సంబంధించిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అలాగే పోతుగల్ గ్రామానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వారి సొంత స్వలాభం కోసం టిఆర్ఎస్ పార్టీకి ముస్తాబాద్ లో మనుగడ లేకపోవడంతో ఈ నగర పంచాయతీలు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఏదేమైనా ఇట్టి చర్యను ముస్తాబాద్ ప్రజా ప్రతినిధులతో పాటు ముస్తాబాద్ మండల ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై స్పందించి పది రోజుల వ్యవధిలో నగర పంచాయతీకార్యక్రమాన్నిఉపసంహరించుకుంటున్నామని మీడియా పూర్వకంగా తెలియజేయాలని లేనిపక్షంలో పోతుగల్ గ్రామంలో ఉన్న ఉపాధి హామీకూలీలతో పాటు గ్రామ ప్రజలు మరియు ముస్తాబాద్, మొర్రాయిపల్లి గ్రామ ప్రజల తోటి ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అవసరమైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి, బీజేవైం మండల అధ్యక్షులు జనార్ధన్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కేసుగాని తిరుపతి, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు మల్లేశం, బిజెపి మండల ఉపాధ్యక్షులు ఆది శేఖర్, కళ్యాణ్, కిట్టు, శ్రీనివాస్, మహేష్ , కొడుముంజ శ్రీను, రాజా గౌడ్, కొమురయ్య, పోశయ్య, మరియు బీజేవైఎం కార్యకర్తలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు