నరేంద్రమోడీ మన్ కి బాత్…

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులను ఉద్ధేశించి మన్ కి బాత్ నిర్వహించారు. తాగునీరు, వ్యవసాయంపై ప్రశ్నలు వచ్చాయన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేటికి రైతులు ఇన్ని సమస్యలు ఎదుర్కొవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం రైతుల వెంట తాను ఉంటానని, రైతాంగానికి యావత్ ప్రభుత్వం యంత్రాంగం బాసటగా ఉంటుందన్నారు. రైతులను అకాల వర్షాలు దెబ్బతీశాయని చెప్పుకొచ్చారు. 120 ఏళ్ల క్రితం తెచ్చిన భూ సేకరణ చట్టంతో రైతాంగాన్ని దోచుకున్నారని, ప్రస్తుత అవసరాలకనుగుణంగా దానిని సవరించుకోవాలని సూచించారు. రైతాంగా సమస్యలన్నింటినీ చట్టబద్ధంగా పరిష్కరించాలన్నారు.