‘నరోడా’ నరహంతక ముఠా సారథిని ఉరి తీయాలి

అప్పటి వరకు..

అదో సువిశాల, సుసంపన్న,  లౌకిక రాజ్యం. అక్కడ కూడా మనుషులే ఉండే వారు. ఆ భయానక క్షణం రానంత వరకు. అక్కడి మనుషులు ఏనాడూ ఊహించని దారుణం వారి జీవితాలను ఛిద్రం చేసింది. వాళ్లే కాదు.. వారి ముందు తరాలు.. ఈ ప్రపంచం అంతమయ్యే వరకు మర్చిపోలేని దుర్ఘటనను పాపం ఆ మనుషులు ఎదు ర్కొన్నారు. ఆ సామరస్య ప్రాంతంలో ఓ వేట తోడేళ్ల గుంపు ప్రవేశించింది. ఆ రాజ్యంలోని ఒక్కొక్కరిని వేటాడింది. చిత్ర హింసలు పెట్టి తన ‘ఆకలి’ని తీర్చుకుంది. ఆ క్షణం గడిచాక చూస్తే, ఆ రాజ్యంలో మనుషులు కనబడలేదు. అన్నీ జీవచ్ఛవాలే కనిపించాయి. తోడేళ్లు చేసిన గాయాల ఆనవాళ్లే కనిపించాయి. అంతగా చిదిమి పోయిన ఆ రాజ్యం పేరు గుజరాత్‌ రాష్ట్రం లోని ‘నరోడా పటియా’. ‘హత్యాచారాలకు’ గురైన ఆ ‘మనుషులు’ ముస్లిం మైనార్టీలు. వీళ్లను జీవచ్ఛవాల్లా మార్చి ఆ వేట తోడేళ్లు ‘హిందూ మతతత్వ శక్తు’లు..

2002లో జరిగిన గుజరాత్‌లోని నరోడా పటియా ప్రాంతంలో జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ ఆ రాష్ట్ర మాజీ మహిళా మంత్రి మాయా కొద్నానీ సహా 32 మందిని దోషులుగా స్పష్టం చేస్తూ ఈ అల్లర్ల కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు వెలువడ్డ అనంతరం కోర్టు వెలుపల ఉన్న నిందితుల బంధువులు తమ వారికి శిక్ష పడిందని చేసిన హాహాకారాలు మిన్నంటాయి. కానీ, నాటి అల్లర్ల వల్ల కోలుకోలేని నరోడా పటియా ప్రాంతంలో మాత్రం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. పదేళ్ల కిందట తమకు జరిగిన అన్యాయానికి, పదేళ్ల తర్వాతైనా న్యాయం జరిగిందని ఆనందభాష్పాటు రా ల్చారు. ఆ ఘోర విపత్తులో అత్యంత దారుణంగా, అమానుషంగా బలైన తమ వారిని ‘యాది’కి తెచ్చుకున్నారు. అమానవీ యంగా, మానవమృగాల అవతారమెత్తి తమ జీవితాలను సర్వ నాశనం చేసిన, తమ కుటుంబ పెద్దల గొంతు కోసి, తమ అక్కా చెల్లెళ్ల మానాలను చెరిచి, నరరూప రాక్షసుల్లా వికటాట్టహాసం చేసిన మతతత్వ శక్తులపై దుమ్మెత్తి పోశారు. పదేళ్లకయినా ఆ ‘వేట తోడేళ్ల’కు శిక్ష పడిందని ఊపిరి పీల్చుకున్నారు. భారత న్యాయ వ్యవస్థపై తమ నమ్మకం సడలలేదని తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. దోషులుగా తేలిన వారికి పడ్డ శిక్ష తమకు పడ్డ ‘శిక్ష’ కన్నా పెద్దది కాకున్నా, ఈ పడ్డ శిక్షనైనా నిందితులు పూర్తిగా అనుభవించేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని, పాలక వర్గాలను ఆ ‘జీవచ్ఛవాలు’ ఇప్పుడు వేడు కుంటున్నాయి. తాము అనుభవించిన శారీ రక, మానసిక క్షోభలో కొంతలో కొంతైనా తమను ఆ క్షోభకు గురి చేసిన వారు అను భవించేలా చేసి, తమకు జరిగిన న్యాయం న్యాయమేనని, తమకు నమ్మకం కలిగేలా నమ్మించాలని విన్నవించుకుంటున్నాయి.

ఆ రోజు ఏం జరిగింది ?

‘నరోడా పటియా నెత్తురోడింది’ అన్నది ‘ఆ రోజు ఏం జరిగింది ?’ అన్న ప్రశ్నకు సంక్షిప్త సమాధానంగా చెప్తే సరిపోదు. విపులంగా ఆ సంఘటనను మననం చేసుకోవాల్సిందే. మెజార్టీ వర్గాల్లోని కొన్ని అరాచకశక్తులకు మత ‘పూనకం’ వస్తే ప్రజాస్వామ్య భారతావని మైనార్టీ ప్రజల బతుకు చిత్రాలు ఎంతలా చితికిపోతాయో తెలుసుకోవాల్సిందే. 2002 ఫిబ్రవరి 27న గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై శాంతి పాటిస్తే నేడు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం నేడు తలదించుకునే పరిస్థితి వచ్చేది కాదు. కానీ, అలా జరుగలేదు. కొన్ని మతతత్వ శక్తులు దాన్ని రాద్ధాంతం చేశాయి. రాజకీయం చేశాయి. మైనార్టీలపై ఉన్న అక్కసును వెల్లగక్కేందుకు ఆ సందర్భాన్ని ఓ అవకాశంగా వాడుకోవాలని చూశాయి. వాడుకున్నాయి. ఘోర మారణకాండలు, ఊచకోతలు, సామూహిక అత్యాచారాలు, సజీవదహనాలు లాంటి దుశ్చేష్టలకు ముస్లిం వర్గాలను గురిచేశాయి. గోద్రా సంఘటన జరిగిన మరునాడు వీహెచ్‌పీ సహా పలు హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కానీ, అంతకు మరో హిందూ మతోన్మాద సంస్థ ‘భజరంగ్‌ దళ్‌’ నాయకుడు బాబూ భజరంగి ముస్లింల ఊచకోతకు తన ‘గుంపు’ను ఉసిగొల్పాడు. అందుకోసం కొన్ని బృం దాలను ఏర్పాటు చేశాడు. ఆ బృందా లకు మారణాయుధాలు ఇచ్చి ప్రోత్సహిం చాడు. గుజరాత్‌లోని ‘చారా’ వర్గానికి చెందిన యువకులను తన పైశాచిక అ నందం తీర్చుకోవడానికి అస్త్రంగా వాడు కున్నాడు. నరోదా పటి యా, నరోదా గావ్‌, నరోదా ప్రాంతాల్లో ముస్లింలు ఎ క్కువగా ఉంటారు కాబట్టి ఆ నరహంతక ముఠాలను ఆ ప్రాంతాలపైకి వదిలాడు.

ఆ ముఠాలు ఏం చేశాయి ?

ఆ రాక్షసులు చెలరేగిపోయి ముస్లింలపై విరుచుకుపడ్డారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ముస్లిం తలలను మొండాల నుంచి వేరు చేశారు. బిక్కుబిక్కుమంటూ దాక్కున్న వారిని, దాక్కున్న చోటే సజీవంగా దహనం చేశారు. చిన్న పిల్లలని కూడా చూడ కుండా గొంతులపై తమ కత్తులు దూ శారు. విచక్షణ రహితంగా పెట్రోల్‌ బాం బులు విసిరి ముస్లింలు ఉండే వాడలను, కాలనీలను, అపార్ట్‌మెంట్లను కాల్చి బుగ్గి చేశారు. ఆడవాళ్లలో వివాహితులు, గర్భి ణులు, అవివాహితులు, మైనర్లు, మేజర్లు అని కూడా చూడకుండా సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టారు. ఆ అమ్మ లు, అక్కలు, చెల్లెళ్లు చేసిన ఆర్తనాదాలు విని ఆనందపడ్డారు. పాపం ఇంకా కొన్ని రోజుల్లో తల్లి కాబోతానన్న ఆనందంలో ఉన్న గర్భిణుల కడుపు కోసి పిండాలను కూడా చంపేశారు. అత్యంత అమానవీ యంగా కొంత మంది గర్భిణుల పిండా లను తమ చేతితో బయటికి లాగేశారం టే ఆ ముస్లిం కుటుంబాలు అనుభవించి న క్షోభ ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత నరకాన్ని తమకు సజీవంగా చూపించి, తమలోని 213 మందిని (ప్రభుత్వ లెక్కల ప్రకారం 97 మంది) బలి తీసుకున్న ఆ మానవ మృగాల్లో ఓ 32 మందికి కోర్టు శిక్ష పడితే ‘నరోడా’ ముస్లింలు సంబురాలు జరుపుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు. పై ఫొటోల్లో ఉన్నవారు ఎంత ఏడ్చినా ఎవరికీ ఏ పాపం అంటదు. ఎందుకంటే వాళ్లు ఏడుస్తున్నది పాపాత్ముల కోసం. వాళ్లు వాళ్ల సొంత వాళ్లే కావచ్చు గాక కానీ, ఆ ‘సొంత వాళ్లు’ పరమత సహనం పాటించాలన్న వివక్షను మరిచి ఎంతో మందికి చెందిన ‘సొంత వాళ్ల’ను అత్యంత దారుణంగా ఊచకోత కోశారు. కాబట్టి వాళ్లు ఏడ్వడమే మంచిది.

‘కుట్రదారుడు’ బయటే ఉన్నాడు..

నరోడా పటియా, నరోడా గావ్‌, నరోడా ప్రాంతాల్లో జరిగిన ఊచకోతకు, మారణకాండకు, అత్యాచారాలకు, అన్ని ఆకృత్యాలకు కుట్రదారుడు, పరోక్షంగా సహకరించిన వాడు, అల్లరి మూకలను ప్రోత్సహించినవాడు, ఎక్కువ మంది ముస్లింలను చంపిన వర్గం నాయకులను ఆలింగనం చేసుకుని, సన్మానించినవాడు ఇంకా బయటే ‘అధికార’ కిరీటం ధరించి దర్జాగా తిరుగుతున్నాడు. 2002 అల్లర్ల గురించి ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుం డా అక్కడి వారినే పాలిస్తున్నాడు. తానే దేశానికి ఆదర్శమని, తానే రానున్న దే శాన్ని పాలిస్తాననే ఊహల్లో సిగ్గు లేకుం డా విర్రవీగుతున్నాడు. ఓ రాష్ట్రానికి ఇత డు పాలకుడైతేనే ఓ మైనార్టీ వర్గం అతని ‘మతతత్వ’ హాస్తాల్లో చిక్కుకుని, ఎంతగా విలవిల్లాడిందో అందరమూ చూశాము. ఒకవేళ అతడు దేశాన్నే పాలిస్తే ! ఊహిం చుకోవడం కూడా ఒళ్లు గగుర్పొడిచే అంశమే. ఆ నాయకుడు ఎవరో చెప్పుకో వాల్సిన అవసరం లేదు.. ప్రస్తుత గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీయే..