నర్రా రాఘవరెడ్డికి ప్రముఖల నివాళి

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవ రెడ్డి కి ప్రముఖులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సీపీఎం కేంద్ర కమిటి సభ్యులు వి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారావు ఎమ్మెల్యే భాస్కర్ రావు, పార్లమెంటరీ కార్యదర్శి గాదారి కిషోర్, కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత అంతటి మహోన్నత వ్యక్తి నర్రారాఘవరెడ్డి అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తామి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు.