నర్సరీలను ఇప్పటి నుంచే సిద్దం చేయాలి
జనగామ,జనవరి3(జనంసాక్షి): వచ్చే హరితహారం కోసం ఇప్పటి నుంచే సిద్దం కావాలని డీఆర్‌డీవో సంపత్‌రావు ఉపాధి హావిూ అధికారులకు సూచించారు. జూన్ 15 వరకు ప్రతీ గ్రామంలోని నర్సరీల్లో మొక్కలు నాటడానికి సిద్ధం చేయాలని అన్నారు. పలు గ్రామాల్లో నర్సరీల పనులు ప్రారంభించాలన్నారు. గ్రామంలోని వన నర్సరీలో జిల్లాలోని ఉపాధి హావిూ అధికారులకు, సిబ్బందికి ఒక రోజు శిక్షణ నిర్వహించారు. మొక్కలు పెంచడానికి విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గ్రామాల్లో పనుల పర్యవేక్షణను ఉపాధి హావిూ సిబ్బంది చూసుకోవాలన్నారు. ప్రతీ మొక్కను బతికించుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.