నర్సాపూర్ లో పి.ఏ.సి.ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మార్కెట్ యార్డ్ లో ఐ.కె.పి . ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రమేష్ ఆకస్మికంగా పరిశీలించారు.
మెదక్,నవంబర్ 10, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చే రైతులకు కేంద్రం నిర్వాహకులు టోకెన్లు జారీ చేసి ఆ వరుస క్రమంలోనే ధాన్యం తూకం చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. గురువారం నర్సాపూర్ లో పి.ఏ.సి.ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మార్కెట్ యార్డ్ లో ఐ.కె.పి . ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం రెడ్డిపల్లిలో వెంకటేశ్వర రైస్ మిల్ ను, కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ లో శ్రీనివాస్ రైస్ ఇండస్ట్రీ ని డి.ఎస్.ఓ., తహశీల్ధార్ తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎఫ్.సి.సి అధికారులు మిల్లులను ఆకస్మికంగా పరిశీలనకు వచ్చినప్పుడు దించుకున్న ధాన్యాన్ని లెక్కించడానికి వీలుగా ధాన్యం బస్తాలు పేర్చుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు.
రైతులకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తూకంలో వ్యత్యాసం లేకుండా చూడాలని అధికారులకు,కేంద్రం నిర్వహకులకు ఎప్పటికప్పుడు తగు ఆదేశాలిస్తూ కోనుగోళ్లు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ వానాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయుటకు ఇప్పటి వరకు జిల్లాలో 374 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5,055 మంది రైతుల నుండి సుమారు 53 కోట్ల విలువ గల 25,630 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 21 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామన్నారు.
ఏ గ్రేడ్ ధాన్యం కు 2060, సాధారణ రకం 2040 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని, రైతులు మధ్యదళారీల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావలసినదిగా ఆయన సూచించారు. 17 శాతం తేమ మించకుండా, తాళ్లు లేకుండా, ఎఫ్.సి.ఐ. ప్రమాణాలకనుగుణంగా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కేంద్రం నిర్వాహకులు కూడా ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే ట్యాగింగ్ చేసిన మిల్లులకు లారీల ద్వారా తరలించాలనన్నారు. ధాన్యం తరలింపుకు వినియోగించే వాహనాలు రోడ్లపై వేచి ఉండకుండా, కొనుగోలు కేంద్రాలలో, మిల్లుల్లో అవసరం మేర కూలీలను ఏర్పాటు చేసుకొని లోకల్ , నాన్-లోకల్ అని చూడకుండా మిల్లులకు వచ్చిన వరుస క్రమంలో లారీలు, ట్రాక్టర్ ల నుండి ధాన్యం దించుకోవాలని మిల్లర్లకు సూచించారు. లోడింగ్ వెంట వెంటనే జరిగేలా వి. ఆర్. ఏ.లు పర్యవేక్షించాలన్నారు. అలాగే ట్రక్ షీట్ వచ్చిన వెంటనే వేగవంతంగా ట్యాబ్ ఎంట్రీలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసిద్దార్ ఆంజనేయులు, పి. ఏ. సి. ఎస్. ఛైర్మన్ రాజు యాదవ్, డి.టి. సాదిక్, తదితరులు పాల్గొన్నా