నర్సీరీలో ప్రవేశాలకు విద్యాహక్కు చట్టం వర్తించదు : ఢీల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : పాఠశాలల్లో నర్సీరీ ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నర్సీరీ ప్రవేశాలకు విద్యాహక్కు చట్టం వర్తించదని కోర్టు తేల్చిచెప్పింది. సామాజిక కార్యకర్త అశోక్‌ అగర్వాల్‌ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. విద్యాహక్కు చట్టం 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు మాత్రమే వర్తిస్తుందని, 6 ఏళ్లలోపు బాలబాలికలకు మాత్రమే వర్తిస్తుందని, 6 ఏళ్లలోపు చిన్నారులే నర్సీరీకి అర్హులైనందున ఈ చట్టానికి అవసరమైన సవరణలు ప్రభుత్వం చేయాల్సి ఉందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని అశోక్‌ అగర్వాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.