నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోండి
మండలి ఛైర్మన్‌కు టిఆర్‌ఎస్ వినతి
హైదరాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యతీసుకుని వారిని అనర్హులుగా ప్రకటించాలని మండలి చైర్మన్‌కు టీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం
మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, కొండా మురళి, యాదవరెడ్డి, రాములునాయక్‌పై ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నలుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్‌ను కోరినట్లు పాతూరి సుధాకర్‌రెడ్డి తెలిపారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేశారని అన్నారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్దంగా వీరు తిరుగబాటు చేసినందున అనర్హులుగా గుర్తించాలని అన్నారు.