నల్గొండలో రైతు ఆత్మహత్య…తట్టుకోలేక చెల్లెలి ఆత్మహత్యాయత్నం

నల్గొండ, సెప్టెంబర్ 10 : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పెద్దవూర మం. సపావతుతండాలో మెగావత్‌ శీను అనే యువ రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని అతడి సోదరి లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్రీను కుటుంబం గత రెండుమూడేళ్లుగా వ్యవసాయంలో లాభం లేకుపోవడంతో అప్పులో కూరుకుపోయింది. దీంతో తండ్రి బాధను చూడలేక శీను ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న జిల్లాలో అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.