నల్గొండ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

 నల్గొండ, సెప్టెంబరు 11 : తెలంగాణా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. నల్గొండ జిల్లాలోని కనగల్‌ మండలం రేగెట్టెలో అప్పుల బాధతో అచ్చాలు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. అన్నదాతల వరుస ఆత్మహత్యలతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.