నల్లగొండలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి

చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నల్లగొండలో చోటుచేసుకుంది. స్థానిక సూర్యాపేట చౌదరి చెరువులో పడి తాళ్లగడ్డకు చెందిన జనార్దన్‌(35) మృతి చెందాడు. అయితే అని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని హత్యచేసి చెరువులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.