నల్లధనం కట్టడికి కీలక చర్యలు

2

– ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,నవంబర్‌18(జనంసాక్షి):

అవినీతిని రూపుమాపడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విదేశాల్లోని అక్రమాస్తుల స్వాధీనంపై బుధవారం ఉదయం దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. తక్కువ వ్యవధిలో అవినీతి, నల్లధనం కట్టడికి కీలక చర్యలు చేపట్టామని వెల్లడించారు. అవినీతిని నిరోధించడానికి ఓ పద్ధతి ప్రకారం చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవినీతికి పాల్పడేవారిని ఉపేక్షించబోమని, అవినీతిపై పోరుకు భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిరోధించాల్సిన అవసరముందన్నారు. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, పేదరిక నిర్మూలనకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు.ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదాన్ని పూర్తిగా నిరోధించాలని పిలుపునిచ్చారు. పేదలకు సంక్షేమ ఫలాలు చేరువ కావాలని ఆకాంక్షించారు. అవినీతి మన ముందున్న పెద్ద సవాలు. నల్లధనం వివరాలు సేకరిస్తున్నాం. అవినీతికి పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని మోడీ తేల్చి చెప్పారు.