నల్లబెల్లం వ్యాపారితో కలిసి పోలీసుల ‘మందు’ పార్టీ

నల్గొండ : నల్గొండ జిల్లా ఆలేరు పోలీసులు ఓ నల్లబెల్లం వ్యాపారితో కలిసి పీకల దాకా తాగి, చిందులేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ బాగోతంతో పోలీసులు కలవరపడుతున్నారు. సాక్షాత్తు పోలీసుస్టేషనులో ఓ వ్యాపారితో కలిసి తాగి నృత్యం చేసిన వీడియో క్లిప్పింగులు బయటకు రావటంతో పోలీసుల బండారం బయటపడింది. పోలీసు ఉన్నతాధికారులు పోలీసుల నిర్వాకంపై ఏ చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.