నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన
కరీంనగర్ : తెలంగాణ బంద్‌కు మద్దతుగా రామగుండం ఒకటో బొగ్గుగనిలో కార్మికుల నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గోదావరిఖని అర్టీసీ డీపో ఎదుట తెరాస శ్రేణుల అందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు తెలంగాణ వాదులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని అందోళన కారులను అరెస్టు చేశారు.