నల్లోండ: రైల్వే గేటును ఢీకొట్టిన డీసీఎం

బీబీనగర్‌: బీబీనగర్‌లోని రైల్వే గేటును శుక్రవారం డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో గేటు విరిగిపోవడంతో ఆమార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బీబీనగర్‌ మండలకేంద్రం నుంచిహైదరబాద్‌ -భువనగిరికి వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే గేటు వద్ద సిగ్నల్‌ రావడంతో గేటు మెన్‌గేటు వేస్తుండగా దాటాలని ఆత్రుతతో డీసీఎం డ్రైవర్‌ వాహనాన్ని వేగంగా గేటును దాటించే ప్రయత్నంలో ఢీకొట్టాడు. దీంతో గేటు విరిగిపోయి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రయాణీలకులు పాత రైల్వే మార్గం గుండా రాకపోకలు సాగించారు.